కడపను ముంచెత్తిన వరద..ఎస్బీఐలోకి చేరిన నీరు - rain in kadapa news
నివర్ తుపాను ప్రభావంతో కడప బుగ్గవంకకు వరద పోటెత్తడంతో అర్థరాత్రి నగరంలో ఆందోళన మొదలైంది. ప్రధానంగా కడప ఏడు రోడ్ల కూడలిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వరద నీరు చేరింది. రాత్రి సిబ్బంది బ్యాంకులోని దస్త్రాలు, ఫైళ్లను భద్రతపరచుకోవడంలో నిమగ్నమయ్యారు. ఉదయానికి వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. వైవీ స్ట్రీట్‌లోని వస్త్ర దుకాణాలోకి నీరు చేరింది. రాత్రి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎస్పీ అన్బురాజన్... ఉదయం నగరంలో పర్యటించారు.