విశాఖలో ప్రపంచ పర్యాటక దినోత్సవం - విశాఖలో ప్రపంచ పర్యాటక దినోత్సవం
విశాఖలో ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా జరిగింది. సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరినాలో జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరాన్ని పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అనేక టీవీ, సినీ గీతాలు ఆలపించిన గాయనీలు తమ పాటలతో అలరించారు. విశాఖలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక, జానపద నృత్యలతో అలరించారు.