వీక్షకులను కట్టిపడేస్తున్న కళ్యాణి డ్యాం అందాలు - తిరుపతి కళ్యాణి డ్యాం
చుట్టూ పచ్చదనం, మైమరిపించే శేషాచలం అందాలు, కొండల మధ్యన జలాశయం పరవళ్లు... వెరసి చిత్తూరు జిల్లా ఏ.రంగంపేట సమీపంలోని కళ్యాణి డ్యాం ప్రకృతికి పుట్టినిల్లుగా కనిపిస్తోంది. తిరుమల, తిరుపతి ప్రజల దాహార్తిని తీర్చే కళ్యాణి డ్యాం.. ఇటీవల భారీ వర్షాలకు నిండుకుండను తలపిస్తోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది. అధికారులు ఓ గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయగా... ఆ దృశ్యాలను చూసేందుకు సందర్శకులు పెద్దఎత్తున వస్తున్నారు. ఆ ప్రాంతమంతా పర్యటకులతో కళకళలాడుతోంది.