హంస వాహనంపై కోదండ రాముడి దర్శనం - tirupathi kodanda ramudi brahmotsav news
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు రాత్రి స్వామివారు హంస వాహనంపై దర్శనమిచ్చి.. భక్తులను కటాక్షించారు. హంస వాహనంపై విహరించే స్వామిని దర్శించుకొంటే... భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. కరోనా వ్యాప్తి దృష్ట్యా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.