కమనీయంగా కళ్యాణ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో.... కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు... హనుమంత వాహనంపై వెంకటాద్రి రాముడి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు మాఢ వీధుల్లో కోలాటాలు, చెక్క భజనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు సాగింది.