జస్టిస్ జేకే మహేశ్వరికి అమరావతి రైతులు ఘన వీడ్కోలు - అమరావతి రైతుల తాజా వార్తలు
హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరికి రాజధాని అమరావతి రైతులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన వెళ్లే మార్గంలో పూలబాట ఏర్పాటు చేశారు. దారి పొడువునా పూలు చల్లి కృతజ్ఞతాపూర్వకంగా వీడ్కోలు పలికారు. జస్టిస్ జేకే మహేశ్వరి న్యాయబద్ధంగా వ్యవహరించడం వల్లే అమరావతి ప్రాంత ప్రజలు ప్రాణాలతో మిగిలారని రాజధాని రైతులు వ్యాఖ్యానించారు. ప్రాణాలు కాపాడిన దేవుడిగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు.