వీణాధారిణికి ఘనంగా నాద హారతి - sangeetha kacheri in gantasala venkateshwarao
వీణాధారిణికి ఘనంగా నాద హారతి పట్టారు. నిర్విరామంగా 12 గంటల పాటు కచ్ఛపి అఖండ మహోత్సవాన్ని విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహించారు. ఆంధ్రులుగా జన్మించి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన వైణిక విధ్వాంసులను స్మరించుకుంటూ... శ్రీ సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది వీణా విద్వాంసులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.