రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వరుని శూలాల ప్రదర్శన - సుబ్రహ్మణ్యేశ్వరస్వామి శూలల ప్రదర్శన
రాజమహేంద్రవరం బర్మా కాలనీ వాసులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ.. శూలాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఒంటికి, నాలుకకు శూలాలు గుచ్చుకుని నగర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు తలమీద పాల బిందెలతో వారి వెంట నడిచారు. చిన్నారులు కావడి మోస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచారు.