తిరుమలలో ముగిసిన శ్రీనివాసుని వార్షిక తెప్పోత్సవాలు - ttd latest news
తిరుమలేశుని తెప్పోత్సవాలు ఐదు రోజులపాటు వైభవంగా సాగాయి. ఉత్సవాల్లో ఆఖరు రోజున స్వామివారు శ్రీవారి ఆలయం నుంచి అమ్మవార్లతో కలసి తిరుచ్చీ వాహనంపై తిరువీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి చేరుకున్నారు. కోనేటిలో నిర్మించిన తెప్పపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఆశీనులైన స్వామివారు ఏడుమార్లు ప్రదక్షిణంగా విహరించారు. విశేష తిరువాభరణాలు, పరిమల భరిత పూలమాలలతో అలంకార భూషితులైన ఉత్సవమూర్తులను వేలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తి సంకీర్తనల మధ్య.. తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఉత్సవాలు ముగియడంతో ఐదు రోజుల పాటు రద్దు చేసిన ఆర్జితసేవలను పునరుద్ధరించనున్నారు.