ఆ పాము కాటేస్తే అంతే..! - విశాఖలో గిరినాగుపాము
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన కింగ్ కోబ్రా విశాఖ జిల్లాలో కనిపించింది. విశాఖ జిల్లా చీడికాడ మండలం తెనుగుపూడి అటవి సెక్షన్ పరిధిలో పొలాల్లో 14 అడుగుల నాగుపాము ఉందని ఆ ప్రాంత రైతులు గుర్తించారు.ఈ విషయాన్ని అటవీ అధికారి ఎం. రమేష్ కుమార్కు చెప్పారు. ఈ పాములు పట్టుకోవడంలో నేర్పు ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ వాలంటీర్లు చాకచక్యంగా పామును పట్టుకున్నారు. 2016 తర్వాత తాము పట్టుకున్న పాముల్లో ఇదే అతిపెద్దదని చెప్పారు. ఇలాంటి అరుదైన పాములు కనిపించినప్పుడు తొందరపాటుతో చంపవద్దని.. తమకు కానీ, అటవీశాఖకు కానీ సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.