ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: చమురు ధరల నుంచి ప్రజలకు ఇక ఊరట లభించదా..? - etv debate

By

Published : Oct 5, 2021, 10:10 PM IST

నిన్న ఉన్న ధర.. ఈ రోజు ఉండడం లేదు. బండి తీసి.. పెట్రో బంకుల వైపు వెళ్లాలంటేనే వణుకు పుడుతోంది. పెట్రోల్, డీజిల్‌ దేనికదే.. సెంచరీలతో వీరవిహారం చేస్తున్నాయి. బిక్కచచ్చి పోతున్న సామాన్యుడి కష్టాల్ని పట్టించుకునే వాళ్లు.. మచ్చుకైనా కనిపించడం లేదు. పులిమీద పుట్రలా కొద్దిరోజులుగా మళ్లీ పెరుగుతున్న ముడిచమురు ధరలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎక్కడ ఎంత పెరుగుతుందో.. దానికి పన్ను భారం తోడై.. ఎలా తడిసి మోపెడవుతుందోనన్న లెక్కలు... ఒక పట్టాన అర్థం కావు. జనం కష్టాల్లో ఉన్నారు.. అయ్యో అని ఓ 4 రూపాయలు పన్నుభారం తగ్గించే పెద్ద మనసు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఈ పరిస్థితుల్లో చమురుమంటల సెగ నుంచి ప్రజలకు ఊరట ఉందా లేదా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details