అక్కాతమ్ముళ్ల మధ్య 'ఆస్తి' చిచ్చు...నలుగురికి తీవ్రగాయాలు
ఆస్తి పంపకాల విషయంలో అక్కాతమ్ముళ్లు మధ్య వివాదం చెలరేగింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల తల్లిదండ్రులు కన్నుమూయడం వల్ల ఆస్తి మాకు రాశారంటే.. మాకు రాశారని ఆరుగురు సంతానం గొడవకు దిగారు. అందరికీ కలిపి రాశారని కూతుళ్లు అనటంతో వివాదం తారాస్థాయికి చేరింది. వారంతా దాడులు చేసుకోవటంతో.. నలుగురు ఆడపిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.