తిరుగిరులను హత్తుకున్న కారుమబ్బులు
చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రకృతి అందాలు నగరవాసులను పులకరింపజేశాయి. సప్తగిరుల మీదుగా కమ్ముకున్న కారుమబ్బులు .... ప్రకృతి ప్రేమికులను అలరించాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. సంధ్యవేళ సప్తగిరుల మాటున సూర్యుడు అస్తమిస్తుండగా ముసురుకొచ్చిన నల్లమేఘాల దృశ్యాలు నగరవాసులను విశేషంగా అలరించాయి.