ప్రతిధ్వని: కొవిడ్ పట్ల అలసత్వం వద్దు.. చికిత్స కంటే నివారణే నయం - corona preventive actions
దేశంలో కొవిడ్ కట్టడే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జన్ ఆందోళన్ పేరిట భారత ప్రధాని మోదీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే పండుగలు, చలికాలం నేపథ్యంలో ప్రజలు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అటు క్రమంగా లాక్డౌన్ నిబంధనలు సడలిస్తోన్న నేపథ్యంలో ప్రజలు ఇంకే విధంగా అప్రమత్తంగా ఉండాలి... ఓనం పండుగ చేదు అనుభవాలతో దసరా, బతుకమ్మ, దీపావళి వంటి పండుగలను ఏ విధంగా జాగ్రత్తగా నిర్వహించుకోవాలి... ఎలాంటి స్వీయరక్షణ చర్యలు తీసుకోవాలి.. అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.