హెయిర్ మాస్క్:మెంతాకు, ఉసిరి, శీకాకాయ, మందార, వేప, కరివేపాకు, గులాబీ రేకలు వీటన్నింటినీ ఎండబెట్టి పొడి చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఒక్కోదాన్నీ చిన్న గిన్నెలోకి తీసుకొని తగినన్ని గోరు వెచ్చని నీటిని కలపాలి. దాన్ని రాత్రంతా నానబెట్టి నూనె రాసిన తలకు పట్టించాలి. ఓ అరగంట తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేస్తే సరి. వారాని కోసారి దీన్ని ప్రయత్నించండి. వెంట్రుకలు రాలడం తగ్గడంతో పాటు కొత్త వెంట్రుకలు రావడం మొదలవుతుంది.
పొడవుగా, ఆరోగ్యంగా ఉండే కురులు కావాలా.. అయితే ఇవి పాటించాల్సిందే - tips for Longer and healthier hair
పొడవుగా, ఆరోగ్యంగా ఉండే కురుల కోసం చూస్తారు అమ్మాయిలు. కారణం తెలియకుండానే అదేమో రాలుతూ ఉంటుంది. గతంలో మాకింత సమస్యే లేదు.. పెద్దవాళ్లు ఈ మాట అంటుంటే ఎన్నోసార్లు వినుంటాం కదా! వాళ్లు పాటించిన చిట్కాలేంటో మనమూ అనుసరిస్తే? అయితే సహజ హెయిర్ మాస్క్, షాంపూలను తయారు చేసుకోండి.
పొడవుగా, ఆరోగ్యంగా ఉండే కురులు కావాలా
*షాంపూ: కుంకుడు కాయలు, శీకాకాయ, ఉసిరి, మెంతులను సమాన పరిమాణంలో తీసుకొని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని వేడి చేయండి. మరుగుతున్న దానికి కొద్దిగా వేపాకుల్నీ కలపాలి. తర్వాత దింపి, ఆరబెట్టాలి. మిశ్రమాన్ని బాగా కలియబెట్టి తర్వాత వడకట్టాలి. సహజ షాంపూ రెడీ! ఫ్రిజ్‌లో ఉంచి, అవసరమైనప్పుడు తీసి వాడుకుంటే సరి. ఇది జుట్టు రాలడాన్నే కాదు చుండ్రును అరికట్టడంలోనూ సాయపడుతుంది.
ఇవీ చూడండి..