నువ్వులు...నలుపు, తెలుపు నువ్వుల్లో విటమిన్లు, పాలీ శాచురేటెడ్ ఫ్యాటీయాసిడ్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి రక్తప్రసరణ సవ్యంగా సాగేలా చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యతను సమన్వయం చేసి జుట్టు రాలకుండా చేస్తాయి.
పొద్దుతిరుగుడు...ఈ విత్తనాలు ఫ్రీరాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడేలా చేస్తాయి. వీటిలోని జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ వంటివి శిరోజాల పెరుగుదలలో తోడ్పడతాయి. దీంతో ఒత్తైన, మృదువైన కురులు మీ సొంతమవుతాయి.
అవిసె గింజలు..ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచు, ప్రొటీన్లు సహా మెగ్నీషియం, క్యాల్షియం వంటి పలురకాల ఖనిజాలు పుష్కలంగా ఉండే ఈ గింజలు శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.