ప్రస్తుతం చాలామందిని వెంటాడుతున్న అనుమానాలివి. నెలసరి రోజుల్లో టీకా తీసుకుంటే ప్రమాదమేమో అని భయపడుతున్నారు. అందుకు కారణం... సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్న అవాస్తవాలూ, పుకార్లే. ఇవి నమ్మి చాలామంది వ్యాక్సిన్ వాయిదా వేసుకోవాలేమో అనుకుంటున్నారు.
నెలసరి వేళ... వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? - పిరియడ్స్ సమయంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
నా వయసు ముప్ఫై దాటింది. త్వరలో వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్నా. కానీ నెలసరికి ముందు ఐదురోజులూ, తర్వాత ఐదు రోజులూ వేయించుకోకూడదని ఓ వాట్సప్ మెసేజ్‌లో చదివాను. నెలసరి సమయంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని అంతా అంటున్నారు. నిజమేనా? వ్యాక్సిన్ వేయించుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - ఓ సోదరి
కానీ నెలసరికి, వ్యాక్సిన్‌కి ఏ సంబంధమూ లేదు. కాబట్టి నిస్సంకోచంగా వేయించుకుని వైరస్‌ని అడ్డుకోవచ్చు. చాలామంది వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు మాంసాహారం తినొచ్చా అని కూడా సందేహపడుతున్నారు. ఎటువంటి ఆహారమైనా తీసుకోవచ్చు. ఇక మొన్నటివరకూ బాలింతలు వ్యాక్సిన్ వేయించుకునే వారు కాదు.. ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం వాళ్లు కూడా వేయించుకోవచ్చని తేలింది. అది బిడ్డకు ఎటువంటి హాని కలిగించదు. అయితే వ్యాక్సిన్ అనంతరం రక్తదానం చేయడానికి కొంత విరామం తీసుకోవాలి. వెంటనే ఇవ్వకూడదు. కాబట్టి రక్తం ఇవ్వాలనుకునేవారు ముందుగానే ఇస్తే మంచిది. - ప్రొఫెసర్ జి.మహాలక్ష్మి, హెచ్ఓడీ, గెనకాలజీ విభాగం, గాంధీ మెడికల్ కళాశాల
ఇదీ చూడండి:భయం వద్దు: 90శాతం రోగులకు ఇంటివద్దే నయం!