పెరుగు
చలువ పదార్థాల్లో ప్రధానమైంది. దీన్ని నేరుగా లేదా మజ్జిగ, లస్సీ, రైతా.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా కడుపులో మంటలాంటి సమస్యలు తగ్గుతాయి.
కొబ్బరి నీళ్లు
దీనిలో ఉండే చక్కెరలు, ఎలక్ట్రోలైట్స్, మినరల్స్... హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు శరీరానికి ఎన్నో ప్రయోజనాలనూ అందిస్తాయి.
పుచ్చ, కర్బూజ
ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో నీటిశాతం ఎక్కువ. ఎంత తిన్నా కడుపు భారీగా అనిపించక పోవడం అదనపు లాభం. కాకపోతే ఒకసారే ముక్కలుగా కోసుకుని ఉంచుకుని, తర్వాత తినడం వద్దు. ఎప్పటికప్పుడు తాజాగా తీసుకోవడం ఉత్తమం.
దోస
దీనిలోనూ నీటిశాతం ఎక్కువే. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. సలాడ్‌గా అయినా, కాస్త, ఉప్పు, కారం/ మిరియాల పొడి చల్లుకుని సాయంత్రం స్నాక్‌గా అయినా తీసుకోవచ్చు.