ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉన్నామని అమరావతి ఐకాస చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కడప ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన జోనల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని రకాల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆర్టీసీలో గతంలో ఉన్న సంఘాలను యధావిథిగా కొనసాగించాలని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా పదకొండో పీఆర్సీని త్వరలో మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.
' ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు..' - Zonal meeting at RTC Employees Union office kadapa news
ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అమరావతి ఐకాస చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కడప ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జోనల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనను ఆర్టీసీ ఉద్యోగులు సన్మానించారు.
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జోనల్ సమావేశం
ఇవీ చూడండి...:జిల్లాలోని 108 కేంద్రాల్లో కొవిడ్-19 డ్రైరన్ కార్యక్రమం
TAGGED:
rtc samavesham