YS SHARMILA ON VIVEKA MURDER CASE : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణ త్వరగా పూర్తి చేసి, దోషులను శిక్షించాలని.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. విచారణ త్వరగా పూర్తి చేయాలని సీబీఐకి విజ్ఞప్తి చేశారు. విచారణ జాప్యం కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి ఏమైనా ఉందా అనే ప్రశ్నకు.. ఉండకూడదు అంటూ జవాబిచ్చారు.
ఇప్పటికైనా వివేకా హత్య కేసును త్వరగా తేల్చండి: షర్మిల - ap latest news
YS SHARMILA ON VIVEKA MURDER CASE: మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించిన విచారణపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసు విచారణను త్వరగా పూర్తి చేసి.. దోషులను శిక్షించాలని కోరారు.
YS SHARMILA ON VIVEKA MURDER CASE
వై.ఎస్.వివేకానందరెడ్డి గొప్ప నాయకుడని షర్మిల అన్నారు. వివేకాను అతి దారుణంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తు ఇన్నేళ్లు చేస్తే వ్యవస్థపై, సీబీఐపై ప్రజలకు నమ్మకం ఉండదని తెలిపారు. ఇప్పటికైనా వివేకా హత్య కేసును తొందరగా తేల్చండని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: