కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రొద్దుటూరులోని ఆయన కార్యాలయంలో కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం ఫ్లెక్సీ విషయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. ఇందుకోసం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ జన్మదిన వేడుకలు.. ప్రొద్దుటూరులో భారీ బందోబస్తు! - వైకాపా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ వార్తలు
వైకాపా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు ప్రొద్దుటూరులో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులూ తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఎమ్మెల్సీపై వార్డు కౌన్సిలర్ తీవ్ర ఆరోపణలు..
ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్పై.. వైకాపా పదో వార్డు కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి శనివారం తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్సీ రమేశ్.. నేరచరిత్ర గల వారని అన్నారు. తన కుటుంబానికి హాని చేస్తాడనే అనుమానం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వివాదంలో ఆయన అనుచరుడు రఘునాథ్పై బ్లేడుతో గాయాలు చేసి.. ఆ కేసును తనపైకి నెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రమేశ్ యాదవ్ నేర చరిత్ర గురించి ఆయన వర్గీయులు తెలుసుకోవాలని కోరారు. ఈ పరిస్థితుల్లో పట్టణంలో ఎలాంటి ఘర్షణలూ చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి :
Balakrishna - Vasundhara Video: చీరాల బీచ్‌లో బాలయ్య సందడి.. టాప్ లెస్ జీప్‌లో సరదా రైడ్