MLC elections: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి.. పాఠశాలలలో ఉపాధ్యాయులకు టిఫిన్ బాక్స్‌లు పంచుతుండగా విద్యార్థి సంఘ నాయకులు పట్టుకున్నారు. వాటిని కడప ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసులు టిఫిన్ బాక్స్‌ల పంపిణీపై ఆరా తీస్తున్నారు. ఏయే పాఠశాలల్లో ఇప్పటివరకూ పంపిణీ చేశారనేది విచారిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరం.. ఓటర్లకు టిఫిన్ బాక్స్‌లు పంపిణీ - kadapa news
MLC elections: పశ్చిమ రాయలసీమ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి.. ఓట్ల కోసం టిఫిన్ బాక్స్‌లు పంపిణీ చేస్తుండగా విద్యార్థి సంఘ నాయకులు పట్టుకున్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థులు ఉపాధ్యాయులకు గిఫ్ట్‌లు పంచి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉపాధ్యాయులకు టిఫిన్ బాక్స్‌లు పంచి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో కూడా రామచంద్రారెడ్డి టిఫిన్ బాక్స్‌లు పంచుతుండగా.. అక్కడ కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇలా నజరానాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించడం సరికాదని విద్యార్థి సంఘం నాయకులు అన్నారు. పోలీసులు ఎమ్మెల్సీ అభ్యర్థులపై నిఘా ఉంచాలని కోరారు.
ఇవీ చదవండి: