రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంచి కార్యక్రమం చేపట్టినా.. చంద్రబాబు నాయుడు పోటీగా కార్యక్రమాలు నిర్వహించి అడ్డుపడుతుంటారని వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం 'దిశ'ను ప్రారంభిస్తే.. దానికి పోటీగా సాధనదీక్ష నిర్వహించడం ఎంతవరకు సమంజసమని కడపలో వ్యాఖ్యానించారు.
'ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే.. చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు' - ysrcp-mlc-c-ramachandraya
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సాధనదీక్ష చేపట్టడంపై వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన దిశ యాప్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికే ఆయన సాధన దీక్ష చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తే చంద్రబాబు తట్టుకోలేరని విమర్శించారు.
వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య
ప్రభుత్వానికి మంచి పేరు వస్తే చంద్రబాబు తట్టుకోలేరని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైకాపాకు ప్రజల్లో ఉన్న ప్రజాభిమానాన్ని అడ్డుకోలేరన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంకా అనేక కార్యక్రమాలు చేపడుతారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:పులివెందులలో ప్రాజెక్టుల నిర్మాణానికి భూమి పూజ.. హాజరైన ఎంపీ