ఆదివారం జమ్మలమడుగు పట్టణ శివారులోని వైకాపా నాయకురాలి కార్యాలయంలో పలువురు నేతలు సమావేశమయ్యారు. వైఎస్సార్ కుటుంబం అండతో సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి.. తర్వాత ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉండే కార్యకర్తలను విస్మరిస్తున్నారని నేతలు వాపోయారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
జమ్మలమడుగు వైకాపాలో విభేదాలు - జమ్మలమడుగు వైసీపీలో వర్గవిభేధాలు న్యూస్
కడప జిల్లా జమ్మలమడుగు వైకాపాలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తూ.. మరో వర్గంపై చిన్నచూపు చూస్తున్నారని పలువురు నేతలు ఆరోపించారు.
జమ్మలమడుగు వైకాపాలో విభేదాలు