ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ప్రలోభాలు.. ఓటర్లకు బహిరంగంగా నగదు పంపిణీ - election latest updates

కడప జిల్లా బి. కోడూరు మండలం ఆనంవారిపల్లెలో ఓటర్లకు నగదు పంపిణీ చేపట్టారు. తాము బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ వైకాపా నేతలు హామీల వర్షం కురిపించారు.

distributing money to voters by ysrcp leaders
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నగదు పంపిణీ

By

Published : Feb 6, 2021, 10:28 PM IST

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు నగదు ఎర వేస్తున్నారు. ఎన్నికలు వచ్చేసరికి మీ సమస్యలు తీరుస్తామని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కడప జిల్లా బి. కోడూరు మండలం ఆనంవారిపల్లెలో వైకాపా బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకునేందుకు నగదుతో ఓటర్లను ప్రలోభపెట్టారు.

రామాలయ నిర్మాణానికి కృషి చేస్తామని.. ఎంత ఖర్చైనా తామే భరిస్తామని భరోసా ఇచ్చారు. దేవుడి సాక్షిగా ఓటు వేయాలంటూ ఓటర్లకు సూచించారు. వైకాపా అభ్యర్థి ఆదిలక్ష్మమ్మ తరఫున కొంత నగదు పంపిణీ చేశారు. నగదు పంపిణీలో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ వీరారెడ్డి, వైకాపా నాయకుడు దుగ్గి రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో అక్రమంగా నగదు పంపిణీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details