ఆదినారాయణ రెడ్డి తన స్థాయి తెలుసుకుని నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడాలని వైకాపా నేత పోన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి విమర్శించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూరైన సందర్భంగా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో సీఎం జగన్ ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన అందిస్తున్నారన్నారు. మాజీ మంత్రి, భాజపా నేత ఆదినారాయణ రెడ్డి నిజాలు తెలుసుకోకుండా సీఎంను విమర్శించడం తగదన్నారు.
'నిజాలు తెలుసుకోకుండా సీఎంను విమర్శించడం తగదు' - kadapa corona cases news
వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది పూరైన సందర్భంగా వైకాపా నేత రామసుబ్బారెడ్డి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి, భాజపా నేత ఆదినారాయణ రెడ్డి నిజాలు తెలుసుకోకుండా సీఎంను విమర్శించడం తగదన్నారు.
!['నిజాలు తెలుసుకోకుండా సీఎంను విమర్శించడం తగదు' ysrcp comments](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7320774-232-7320774-1590243976827.jpg)
ysrcp comments
విలువలు, స్థాయి గురించి ఆదినారాయణ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైకాపా గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టినప్పుడు తన స్థాయి ఏమైందని ప్రశ్నించారు. విలువ లేని రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.