కడప జిల్లా కోడూరులో వైయస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. రాష్ట్రం మెుత్తం మీద 90 లక్షల 37 వేల 2 వందల 54 మంది మహిళల ఖాతాల్లోకి రూ.1400 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వ విప్ వివరించారు. కోడూరు నియోజకవర్గంలో 3 వేల 5 వందల 83 డ్వాక్రా గ్రూపుల మహిళల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు తెలిపారు.
వైయస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ - ysr zero interest in kodur news
కడప జిల్లా కోడూరూలో వైయస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభమయ్యింది. నియోజకవర్గంలో ఉన్న డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న అందరి మహిళల ఖాతాల్లోకి నగదు జమ అయినట్లు ప్రభుత్వ విప్ వివరించారు.
కోడూరులో వైయస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభించిన ప్రభుత్వ విప్