కడప జిల్లాలోని పలు చోట్ల వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు.రైతుల సంక్షేమం కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.పట్టణంలోని కళాంజలి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.కడప జిల్లా రైల్వేకోడూరులోని తహశీల్దార్ కార్యాలయంలో ఎంపీ మిథున్‌రెడ్డి,ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు రైతు భరోసాను ప్రారంభించారు.రైతులకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటుచేసి వారు ఉపయోగించే సామగ్రి,ఎరువులు,మందులు,సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు.కమలాపురంలో రైతు భరోసా కార్యక్రమం ఆర్.ఓ జయ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో జరిగింది.
కడప జిల్లాలో అట్టహాసంగా రైతుభరోసా-పీఎం కిసాన్ పథకం - ysr raithu bharosa in kadapa district 2019
కడప జిల్లాలోని పలు చోట్ల వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజాపతినిధులు, అధికారులు.. లబ్ధిదారులకు చెక్ లను అందించారు.
కడప జిల్లాలో అట్టహాసంగా రైతుభరోసా- పీఎం కిసాన్ పథకం
TAGGED:
raithu bharosa