ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్ నవోదయం రీ స్టార్ట్ ప్యాకేజీ మెగా చెక్కు విడుదల - kadapa dst latest msme news

వైఎస్సార్ నవోదయం రీ స్టార్ట్ ప్యాకేజీ ద్వారా కడప జిల్లాకు చెందిన 502 ఎంఎస్ఎంఈ యూనిట్లకు రెండవ విడతగా విడుదల అయిన మెగా చెక్కును జిల్లా కలెక్టర్ హరికిరణ్ పారిశ్రామికవేత్త రాజోలి వీరారెడ్డి, జేసీ శివారెడ్డికి అందించారు. ఎంఎస్ఎంఈ ద్వారా యువతకు ఉపాధి లభిస్తోందని తెలిపారు.

YSR navodayam fund released in kadapa dst
YSR navodayam fund released in kadapa dst

By

Published : Jun 29, 2020, 11:03 PM IST

వైఎస్సార్ నవోదయం రీ స్టార్ట్ ప్యాకేజీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోస్తోందని కడప జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పేర్కొన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రెండో విడత రాయితీ బకాయిలను ఎంఎస్ఎంఈల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

జిల్లాకు చెందిన 502 ఎంఎస్ఎంఈ యూనిట్లకు రెండవ విడత రిస్టార్ట్ ప్యాకేజి కింద విడుదలయిన రూ.28,83,00,000 ల మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జేసీ శివారెడ్డి, పారిశ్రామిక వేత్త రాజోలి వీరారెడ్డిలు లబ్దిదారులకు అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం యువతలో నైపుణ్యాన్ని పెంచి, అటు పారిశ్రామిక, ఇటు సర్వీసు రంగాల్లో ప్రభుత్వం ఉపాధి అవకాశాలను అపారంగా అందిస్తోందని కలెక్టర్ తెలిపారు.

ఇదీ చూడండిభారత్‌లో టిక్‌టాక్‌ సహా 59 యాప్​లపై నిషేధం

ABOUT THE AUTHOR

...view details