డాక్టర్ అచ్చన్న హత్య కేసు సిట్టింగ్ జడ్జితో విచారించాలి: వైఎస్సార్ జిల్లా సీపీఐ కార్యదర్శి Dr Achanna Murder Case : కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న హత్య కేసులో అనుమానితులను వదిలేసి ఆందోళనకారులపై పోలీసులు ప్రతాపం చూపడం దారుణమని వైఎస్సార్ జిల్లా సీపీఐ కార్యదర్శి చంద్ర అన్నారు. కడప ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష పార్టీ నాయకుల విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోకుండా ఉండాలంటే డాక్టర్ అచ్చన్న హత్య కేసును సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టాలని అఖిల పక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఉద్యమాన్ని ఆపలేరు :దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈ నెల 11న అఖిల పక్ష పార్టీ ఆధ్వర్యంలో చలో ముఖ్యమంత్రి కార్యాలయం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఉద్యమాన్ని ఆపలేరని, డాక్టర్ అచ్చన్న హత్య కేసులో దోషులకు శిక్ష పడేంత వరకు ఉద్యమాన్ని ఎంత దూరమైన తీసుకెళ్తామని నాయకులు హెచ్చరించారు.
దళితులపై దాడులు.. క్షమించరాని నేరం : అచ్చన్న హత్య కేసులో కొంత మంది అనుమానితులు ఉన్నారని.. వారిని కూడా విచారించాలని డిమాండ్ చేశారు. కేసును తప్పుదోవ పట్టించిన కడప ఒకటవ పట్టణ సీఐపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య వ్యక్తులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను, అందులోనూ దళితులపైనే ఎక్కువగా దాడులు చేయడం క్షమించరాని నేరమని అన్నారు. గత నెల 12వ తేదీన అచ్చన్న అదృశ్యమైనా... 24వ తేదీ వరకూ పోలీసులు గుర్తించకపోవడం, దళితులపై నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు.
పోలీసులు అడ్డంకులు సృష్టించడం సరైన పద్దతి కాదు : శనివారం కడపలో అఖిల పక్ష పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని, కానీ పోలీసులు తెల్లవారు జామునే ఆందోళనకారుల నివాసాలకు వెళ్లి గృహ నిర్బంధం చేశారని తెలిపారు. ఓ హోటల్లో బస చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను బయటికి బయటకు రాకుండా చేశారని చెప్పారు. అత్యంత దౌర్భాగ్యంగా, దౌర్జన్యంగా ఆందోళనకారులను తోసేసి అరెస్టు చేయడం దారుణమని అన్నారు. పోలీసులు చేసిన దౌర్జన్యంలో పలువురు ఆందోళన కారులు గాయపడ్డారని ఆరోపించారు. శాంతి యుతంగా నిరసన కార్యక్రమం చేపడుతామని చెప్పినప్పటికీ పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం సరైన పద్దతి కాదని అన్నారు.
" ముద్దాయిలను సరైన పద్దతిలో విచారించాలని మేము కోరుతుంటే, ముద్దాయిలని వదిలేసి ముందస్తు అరెస్టుల పేరుతోనాయకులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది.డాక్టర్ అచ్చన్న హత్య కేసుపై సమగ్రమైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించిదోషులనుకఠినంగా శిక్షించాలి. అందుకోసం 11వ తేదీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా చాటి చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. " - చంద్ర, వైఎస్సార్ జిల్లా సీపీఐ కార్యదర్శి
ఇవీ చదవండి