YS Viveka Murder Case : వివేకా హత్య కేసు.. సీబీఐని కలిసిన మాజీ డ్రైవర్ దస్తగిరి - వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ
15:22 February 16
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి
YS Viveka Murder Case : కడపలో సీబీఐ అధికారుల వద్దకు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి వెళ్లారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. కోర్టు తీర్పు దృష్ట్యా సీబీఐ అధికారులను కలిశారు. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ నవంబరు 26న కడప కోర్టు ఉత్తర్వులిచ్చింది. మరోసారి దస్తగిరితో కోర్టులో.. సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.
కడప సబ్ కోర్టు అనుమతి..
Viveka Murder Case : మాజీమంత్రి వివేకా హత్య కేసులో.. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప సబ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్నాడని.. 306 సెక్షన్ కింద సాక్ష్యం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. దస్తగిరిని అప్రూవర్‌గా మారేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు మరోసారి దస్తగిరి నుంచి 164 సెక్షన్ కింద మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి :వివేకా హత్య కేసు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ... ఆ పిటిషన్లు కొట్టివేత