మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి.. ఇప్పుడు మనమధ్య లేకపోవడం బాధాకరమని కడప జిల్లా కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. వివేకా 71 వ జయంతి సందర్బంగా కడప వైకాపా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజలందరికీ వివేకానందరెడ్డి అజాతశత్రువు అనే విషయం తెలిసిన విషయమే అన్నారు.
పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 71 వ జయంతి నిర్వహించారు. వైఎస్ కుటుంబ సభ్యులు, వైకాపా కార్యకర్తలు హాజరయ్యారు. వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి.. దివ్యాంగులకు స్కూటర్లను పంపిణీ చేశారు.