వివేకానందరెడ్డి మృతిపై సిట్ ఏర్పాటు - YERPATU
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సిట్ ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నామని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు.
కడప జిల్లా సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విచారణ జరగనుంది. వివేకానందరెడ్డి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామన్నారు. ఘటనాస్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించిందని పేర్కొన్నారు. వివేకా మృతి వెనక ఎవరి పాత్ర ఉన్నట్లు తేలినా కఠిన చర్యలు తప్పవని చెప్పారు.