వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకా మార్చి 15న అనుమానాస్పద మృతి... రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వివేకా మృతిపై అప్పటి తెదేపా ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ లోపు సార్వత్రిక ఎన్నికలు రావటంతో దర్యాప్తు కొంచెం నెమ్మదించిందనే చెప్పవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దర్యాప్తును వేగవంతం చేశారు. సిట్ బృందం ఉండగానే... అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన 23 మంది అధికారులతో మరో బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
'వైయస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం' - SIT
వైయస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన 23 మంది అధికారుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
!['వైయస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3581891-556-3581891-1560761489668.jpg)
'వైయస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం'
'వైయస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం'
Last Updated : Jun 17, 2019, 3:41 PM IST