ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YS VIVEKA CASE: సీబీఐ విచారణకు.. వివేకా మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్

YS Viveka Murder case
YS Viveka Murder case

By

Published : Aug 28, 2021, 1:25 PM IST

Updated : Aug 28, 2021, 3:02 PM IST

13:07 August 28

పోస్టుమార్టం నివేదికను మరోసారి పరిశీలించిన సీబీఐ అధికారులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వరుసగా 83వ రోజు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తోంది. వివేకా మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్ ఆనంద నాయక్​ను సీబీఐ అధికారులు విచారించారు. పోస్ట్‌మార్టం నివేదికను మరోసారి అధికారులు పరిశీలించారు.

  • సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలపై విచారణ వాయిదా

మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్​కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోసం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్​పై జమ్మలమడుగు కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 45 నిమిషాల పాటు ఇరుపక్షాల న్యాయవాదులు ఆన్​లైన్​లో వాదనలు వినిపించారు. వాదనలు విన్న జమ్మలమడుగు మెజిస్ట్రేట్.. విచారణ వచ్చే నెల 1కి వాయిదా వేశారు.

  • ఇది వరకే రివార్డు ప్రకటన..

వివేకా హత్య కేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తామని ఇప్పటికే సీబీఐ ప్రకటించింది. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురయ్యారని.. హై కోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 9న వివేకా హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ప్రకటనలో పేర్కొంది. సామాన్య ప్రజలు ఎవరైనా సమాచారం అందించవచ్చని.. అలాంటి వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ ప్రకటనలో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి.. తెలిసిన సమాచారం సీబీఐ అధికారులైన దీపక్ గౌర్, రాంసింగ్ లకు అందజేయాలని వారి ఫోన్ నంబర్లు, చిరునామాను ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చదవండి:

TDP protest: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై తెదేపా నిరసనలు

Last Updated : Aug 28, 2021, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details