ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది: దస్తగిరి - ys viveka murder case

DASTAGIRI PRESS MEET : తనకు ప్రాణభయం ఉందని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి, అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని అన్నారు.

DASTAGIRI
DASTAGIRI

By

Published : Oct 13, 2022, 4:52 PM IST

Dastagiri Comments on his Security : నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని వివేకా హత్య కేసులో అప్రూవర్​గా మారిన దస్తగిరి తెలిపాడు. తనకు ముప్పు తలపెట్టేందుకు కుట్ర జరుగుతోందంటూ పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులంతా సీఎం చెప్పినట్లే వింటారని.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్ అందరూ ఒకే కుటుంబం అని పేర్కొన్నారు. వివేకా కేసు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారని.. తనను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందన్నాడు. పెద్దవాళ్లనే కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నారు.. వారికి నేను లెక్క కాదన్నాడు. నాకు ప్రాణభయం ఉంది.. రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు తెలిపాడు. గన్‌మెన్లను ఎందుకు మార్చారని ఎస్పీకి ఫిర్యాదు చేస్తే.. నా వ్యాఖ్యలు అసత్యాలని ఎస్పీ చెప్పడం బాధాకరంగా ఉందన్నారు. సమస్య నాది.. ఏం కుట్ర జరుగుతుందో తనకు తెలుసనని వివరించారు.

పెద్దవాళ్లనే కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నారు.. వారికి నేను లెక్క కాదు

నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత. నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. పెద్దవాళ్లనే కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నారు.. వారికి నేను లెక్క కాదు... నాకు ప్రాణ భయం ఉంది.. రక్షణ కల్పించాలని కోరుతున్నా. సమస్య నాది.. ఏం కుట్ర జరుగుతుందో నాకు తెలుసు. -దస్తగిరి

మరోసారి కడప ఎస్పీకి ఫిర్యాదు :బుధవారం నాడు తనకు ఎదురవుతున్న ముప్పు గురించి కడప ఎస్పీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారం రోజుల కిందట తన ఇంటి పెంపుడు కుక్క చనిపోయిందని.. వాటిలో ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు దస్తగిరి వ్యక్తం చేశారు. ఈనెల 2వ తేదీన తన ఇంటి పెంపుడు కుక్క చనిపోయిందని.. 6వ తేదీన గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో తన ఇంటికి వద్దకు వచ్చి.. కుక్కను కొంటామని అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఇంటివద్ద లేని సమయం చూసి.. కుక్కను అడిగి వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుక్క చనిపోవడం, ఆరుగురు వ్యక్తులు ఇంటికి రావడం చూస్తే ఏదో అనుమానం కలుగుతోందని.. వాటిపై విచారణ చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ అన్బురాజన్​కు దస్తగిరి ఫిర్యాదు చేశారు.

రెండు రోజుల కిందటే తన గన్​మెన్​ల మార్పు అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేసిన దస్తగిరి.. ఇపుడు మళ్లీ మరో ఫిర్యాదు అందజేయడం చర్చనీయాంశమైంది. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ కడపలోని సీబీఐ అధికారులకు కూడా లేఖ అందజేశారు. సీబీఐ అధికారులతో ఇంకా చాలా విషయాలను దస్తగిరి వివరించినట్లు తెలిసింది. అనంతరం కడప నుంచి పులివెందుల వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details