ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ అభిమానులతో షర్మిల భేటీ - ys sharmila meeting with hyderabad leaders

హైదరాబాద్‌లో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. వారితో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

ys sharmila meeting with hyderabad leaders
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ అభిమానులతో షర్మిల భేటీ

By

Published : Feb 20, 2021, 12:31 PM IST

తెలంగాణలోని వైఎస్‌ఆర్‌ అభిమానులతో వైఎస్‌ షర్మిల ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ అవుతున్న ఆమె.. భవిష్యత్తు కార్యాచరణపై వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో షర్మిల భేటీ అయ్యారు. వారితో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

నిన్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల.. మార్చి 2న మరోసారి వారితో భేటీ కానున్నారు. జిల్లాల వారీగా సమగ్ర సమాచారం సేకరిస్తూ.. రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకుంటున్నారు. వీలైనంత త్వరగా పార్టీ ఏర్పాటు చేసే యోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details