ఈ రోజు సాయంత్రం కడప జిల్లా ఇడుపులపాయకు వైఎస్ షర్మిల రానున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయ చేరుకోనున్నారు. రాత్రికి ఇడుపులపాయ ఎస్టేట్లో బస చేస్తారు.
రేపు ఉదయం 8 గంటలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. పార్టీ జెండాను తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం కడప నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లనున్నారు.