ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YS Sharmila: నేడు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల - రేపు ఇడుపులపాయ రానున్న వైఎస్ షర్మిల వార్తలు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.. నేడు కడప జిల్లా ఇడుపులపాయ వెళ్లనున్నారు. ఈ నెల 20న తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర చేపట్టనుండగా..తండ్రి వైఎస్​ఆర్ సమాధి వద్ద నివాళులర్పించి ఆశీర్వాదం తీసుకోనున్నారు.

రేపు ఇడుపులపాయ రానున్న వైఎస్ షర్మిల
రేపు ఇడుపులపాయ రానున్న వైఎస్ షర్మిల

By

Published : Oct 18, 2021, 8:51 PM IST

Updated : Oct 19, 2021, 4:00 AM IST

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.. నేడు కడప జిల్లా ఇడుపులపాయ రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో మంగళవారం ఉదయం కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి వాహనంలో ఇడుపులపాయకు బయల్దేరి వెళ్తారు. మధ్యాహ్నం తల్లి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలసి తండ్రి వైఎస్ రాజశేఖర్​ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.

ఈనెల 20 నుంచి పాదయాత్ర

ఈ నెల 20న తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రకు ముందు తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదం తీసుకోవడానికి ఆమె ఇడుపులపాయ వెళ్లనున్నారు. ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఎస్టేట్​లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. సాయంత్రం తిరిగి కడప నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్తారని షర్మిల సన్నిహితులు వెల్లడించారు.

ఇదీ చదవండి

CM Jagan review on power: థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలి: సీఎం జగన్

Last Updated : Oct 19, 2021, 4:00 AM IST

ABOUT THE AUTHOR

...view details