కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంట వద్ద అల్లరి మూకలు హల్ చల్ చేశాయి. నడిరోడ్డుపై ఆర్ఎంపీ డాక్టర్ రాజేశ్వరి ముఖంపై కొందరు యువకులు టీ పోసి వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై బాధితురాలు బద్వేలు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనను కొంతకాలంగా నర్సింహారెడ్డి అనే వ్యక్తి వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బద్వేలు అట్లూరు మండలానికి చెందిన కొంతమంది రౌడీలను అదుపులోకి తీసుకుని ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. అల్లరిమూకల జాడపై ఆరా తీస్తున్నారు.