కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఉర్లగడ్డపోడు - అనంతరాజుపేట వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. రైలు కింద పడి చనిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి 25 ఏళ్లలోపు వయసుంటుందని.. బ్లూ కలర్ టీ షర్ట్, ఫ్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. పట్టాలు దాటుతున్న సమయంలో కానీ.. ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి కానీ మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు పట్టాలపై.. గుర్తు తెలియని యువకుడి మృతదేహం - రైల్వేకోడూరులో రైలు కింద పడి వ్యక్తి మృతి
కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఉర్లగడ్డపోడు - అనంతరాజుపేట వద్ద రైలు పట్టాలపై వ్యక్తి మృతిచెందాడు.
రైలుకింద పడి యువకుడి మృతి