ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేయని నేరానికి పోలీసులు వేధిస్తున్నారంటూ.. యువకుడి ఆత్మహత్యాయత్నం - కడపలో యువకుపడి ఆత్మహత్యాయత్నం

పోలీసులు వేధిస్తున్నారంటూ కడప జిల్లా కమ్మవారిపల్లెకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చేయని నేరానికి స్టేషన్​కు రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారంటూ విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఓ అమ్మాయికి వాట్సప్ ద్వారా అసభ్య సందేశాలు పంపిన నిందితుడు.. కేసును తప్పుదోవ పట్టించేందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.

చేయని నేరానికి పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
చేయని నేరానికి పోలీసులు వేధిస్తున్నారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం

By

Published : Jan 9, 2021, 3:52 PM IST

చేయని నేరానికి పోలీసులు వేధిస్తున్నారంటూ కడప జిల్లా కమ్మవారిపల్లెకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు కడప సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నీలకంఠ అనే యువకుడు వాట్సప్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్నాడంటూ గుంటూరు లా కళాశాలకు చెందిన విద్యార్థిని బ్రహ్మంగారిమఠం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు స్టేషన్​కు రావాల్సిందిగా నీలకంఠను ఆదేశించారు.

తనకు సంబంధం లేని కేసులో బాధ్యులను వదిలేసి తనను స్టేషన్​కు పిలుస్తున్నారని మనస్థాపం చెంది..నీలకంఠ శుక్రవారం రాత్రి విషద్రావణం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబసభ్యులు బాధితుడిని ఆసుపత్రికి తరలించగా..ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. విచారణకు సహకరించకుండా కేసును తప్పుదోవ పట్టించి, పోలీసులను బెదిరించే ప్రయత్నంలో భాగంగానే యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details