ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంటెద్దు బండిని ఢీకొన్న ద్విచక్రవాహనం.. యువకుడు మృతి - రాయచోటి రింగ్​ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కడప జిల్లా రాయచోటి రింగ్​ రోడ్డు వద్ద.. ఒంటెద్దు బండిని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో.. ఓ యువకుడు మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

death
ఒంటెద్దు బండిని ఢీకొన్న ద్విచక్రవాహనం.. యువకుడు మృతి

By

Published : Mar 31, 2021, 12:18 PM IST

కడప జిల్లా రాయచోటి రింగ్​ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. పొలం నుంచి గ్రాసంతో ఇంటికొస్తున్న ఒంటెద్దు బండిని.. కడప వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో యువకుడు నాగరాజు అక్కడికక్కడే మృతిచెందగా..తిరుపాల్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్.సోమవరానికి చెందిన నాగరాజు 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తరువాత పొలం పనులు చేస్తూ.. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. యువకుడికి సోదరుడు, చెల్లెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు.. ట్రాఫిక్ ఎస్సై వరప్రసాద్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details