కడప జిల్లా పెనగలూరు మండలం ఓబిలి గ్రామానికి చెందిన పాపయ్య, రామలక్ష్మమ్మకు నలుగురు సంతానం. వారిలో పెద్ద కుమారుడు ఈశ్వరయ్య, రెండో కుమారుడు మహేశ్వరయ్య. తన ఇంటి ఆవరణలో చెత్త వేశాడని అన్న ఈశ్వరయ్యతో తమ్ముడు గొడవపడ్డాడు. ఆ వాగ్వాదం తారస్థాయికి చేరి ఈశ్వరయ్య తమ్ముడు మహేశ్వరయ్యపై దాడి చేశాడు. రాడ్తో బలంగా కొట్టటంతో మహేశ్వరయ్య కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.
అన్నదమ్ముల మధ్య గొడవ... తమ్ముడి మృతి - younger brother was killed by elder brother kadapa latest news
కడప జిల్లాలో అన్నదమ్ముల మధ్య గొడవ... తమ్ముడి ప్రాణం తీసింది. తమ్ముడి ఇంటి ఆవరణలో అన్న చెత్త వేశాడనే కారణంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదై ప్రాణం మీదకు వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రాణం తీసిన అన్నదమ్ముల మధ్య గొడవ
TAGGED:
crime news at kadapa