కడప జిల్లా రైల్వేకోడూరులో మరో విషాదం నెలకొంది. రెండు రోజుల కిందట గుండాలపల్లె సమీపంలోని గుంజన ఏరులో ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతిచెందాడు. ఆ ఘటన మరవకముందే ఇవాళ మధ్యాహ్న సమయంలో మరో యువకుడు అదే ఏరులో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ, గుర్రప్పాలెంకు చెందిన పెంచలయ్య(20) గుంజన ఏరులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో అధికారులు, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఏరు వద్దకు చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టగా పెంచలయ్య మృతదేహం లభ్యమయ్యింది.
గుంజన ఏరులో ఈతకు వెళ్లి.. మరో యువకుడు మృతి - రైల్వేకోడూరు వార్తలు
రైల్వేకోడూరులో మరో విషాదం నెలకొంది. రెండు రోజుల కిందట గుండాలపల్లె సమీపంలోని గుంజన ఏరులో ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతిచెందాడు. ఆ ఘటన మరవక ముందే తాజాగా మరో యువకుడు అదే రీతిలో మృత్యువాత పడ్డాడు. రెండు రోజుల వ్యవధిలో ఒకే ఏరులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు చనిపోవటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈతకు వెళ్లి యువకుడు మృతి
పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎమ్మెల్యే వారిని ఓదార్చి, కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: రేపు జమ్మలమడుగులో తెదేపా నిజనిర్థరణ కమిటీ పర్యటన