ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాపాగ్ని నదిలో మునిగి యువకుడి మృతి - నదిలో మునిగి యువకుడి మృతి

పాపాగ్ని నదిలో మునిగి యువకుడు మృతిచెందిన ఘటన కడప జిల్లా పెండ్లిమర్రిలో చోటుచేసుకుంది. ఘటనస్థలిలో జేసీబీల సహాయంతో తవ్వకాలు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు.

పాపాగ్ని నదిలో మునిగి యువకుడి మృతి
పాపాగ్ని నదిలో మునిగి యువకుడి మృతి

By

Published : Sep 20, 2020, 10:40 PM IST

కడప జిల్లా పెండ్లిమర్రిలో విషాదం చోటుచేసుకుంది. పాపాగ్ని నదిలో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన సాగర్​ పాపాగ్ని నదిలో నీటి ప్రవాహం ఎక్కువైందని తెలిసి స్నేహితులతో కలిసి చూసేందుకు వెళ్లాడు. నదిలో ఇసుకకోసం తవ్విన గుంతలో పడిన సాగర్​...నది ప్రవాహనికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలిలో జేసీబీల సహాయంతో తవ్వకాలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు.

విజయవాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సాగర్...కరోనా కారణంగా గత కొంతకాలంగా ఇంటివద్దే ఉంటున్నాడు. చేతికి వచ్చిన కుమారుడు మృతి చెందటంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీచదవండి
విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details