కడప జిల్లా ముద్దనూరు మండలంలో బుధవారం రాత్రి లారీ ఢీ కొని ఓ యువకుడు మృతి చెందాడు. కొండాపురం మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి(27) ద్విచక్రవాహనంపై ప్రొద్దుటూరుకు బయలుదేరాడు. ముద్దనూరు మండలం ఉమారెడ్డిపల్లి గ్రామం వద్ద ఎదురుగా ఓ లారీ వచ్చి ఢీకొనడంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి కుప్పకూలిపోయాడు. వెంటనే ముద్దునూరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. ముద్దనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని యువకుడు మృతి - accidents in proditurur
కడప జిల్లా ముద్దనూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. పెళ్లైన మూడు నెలలకే యువకుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి . ఈ ఘటనపై ముద్దనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీ.. యువకుడు మృతి