Farmer suicide in Kadapa district: అప్పుల బాధలు తాళలేక మరో యువరైతు ప్రాణాలు వదిలాడు. ఈనెల 7న వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లెకు చెందిన యువరైతు పోచంరెడ్డి సుధాకర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి చేర్పించి తరువాత కడప రిమ్స్‌కు తరలించారు. ఎనిమిదెకరాల పొలం కలిగిన సుధాకర్‌రెడ్డి వ్యవసాయం కోసం బ్యాంకులతోపాటు పలువురి వద్ద అప్పులు చేశాడు. వరి, మిరప, పత్తి, వంగ వంటి పంటలు సాగు చేసి నష్టపోయాడు. చివరికి అప్పులు తీర్చడానికి ఏడు ఎకరాలు పొలం అమ్మాడు. అయినా సరే అప్పులు తీరక.. కుటుంబ పోషణ భారం కావడంతో విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుధాకర్‌రెడ్డి మృతితో కుటుంబసభ్యుల బాధ అరణ్యరోదనగా మారింది. సుధాకర్ రెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఏడెకరాలు అమ్మినా అప్పు తీర లేదు.. యువరైతు ఆత్మహత్య - యువరైతు ప్రాణాలు వదిలాడు
Farmer suicide in Kadapa district: రైతులకు పెద్ద పీట వేస్తున్నామని ప్రభుత్వాలు మాటలు చెప్తున్నా ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా అప్పుల బాధ తట్టుకోలేక మరో యువరైతు మృతి చెందాడు. ఎనిమిదెకరాల రైతు, ఏడు ఎకరాలు అమ్మినా అప్పుల తీరలేదు. చివరికి తానే ప్రాణాలు తీసుకొని.. భార్యా ముగ్గురు పిల్లలను ఒంటరి చేసిన ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది.
అప్పులు బాధతో రైతు ఆత్మహత్య