కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమెర్ల గ్రామానికి చెందిన కర్నాటి రమేష్ రెడ్డి అనే యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం తన సొంత పొలంలోనే పురుగుల మందు తాగి చనిపోయినట్టు తలమంచిపట్నం ఎస్సై ధనంజయుడు తెలిపారు. 9 ఎకరాల పొలంలో ముగ్గురు అన్నదమ్ములు సాగు చేసేవారు.
రెండు మూడేళ్లుగా నష్టాలు రావడంతో అప్పులు ఎక్కువైపోయాయి. వాటిని ఎలా కట్టాలో తెలియక రమేష్ రెడ్డి ఆవేదనకు గురయ్యాడు. బలవన్మరణానికి పాలుపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే చనిపోయినట్లు బంధువులు తెలపగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.