ఆర్థిక కష్టం దంపతుల ఉసురు తీసింది.. చిన్నారిని అనాథను చేసింది! - young couple committed suicide due to financial problems
పండుగ పూట సంతోషంగా ఉండాల్సిన ఆ దంపతులు.. బలవంతంగా ప్రాణం తీసుకున్నారు. నెల వయసున్న పసిగుడ్డును నిర్దాక్షిణ్యంగా వదిలేసి.. ఆత్మహత్య చేసుకున్నారు. కడపకు చెందిన ఈ భార్యాభర్తలు.. ఆర్థిక కష్టాలతోనే.. హైదరాబాద్ లో బలవన్మరణానికి పాల్పడ్డారు.
హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పండుగ పూట దారుణం జరిగింది. బోడుప్పల్‌లోని సాయిరాం కాలనీలో ఉంటున్న యువ దంపతులు అక్షత్ (26), చైతన్య (24) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని కడప జిల్లా చంపాడు గ్రామానికి చెందిన ఈ దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్ లోని బోడుప్పల్ కు వలస వచ్చారు. అందరూ సంక్రాంతి సంబరాల్లో ఉన్న వేళ.. వారు తనువు చాలించారు. వీరికి నెల వయస్సు గల కుమార్తె ఉంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక సమస్యలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.